NDL: సుంకులమ్మ వీధిలోని శ్రీ సుంకులా పరమేశ్వరీ దేవస్థానంలో ఆదివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా రూ.2 లక్షల 36 వేలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఛైర్మన్ డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఈ నిధులను దేవాలయ అభివృద్ధికి వినియోగిస్తామని పేర్కొన్నారు. భక్తుల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.