NLR: కందుకూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు ఆదివారం రాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పామూరు రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల మొబైల్ ఫోన్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ పులి శివ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.