సత్యసాయి: సోమందేపల్లి మండలం రేణుకానగర్లో గురువారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందిన నాటు కోళ్లను వైద్య సిబ్బంది పరిశీలించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతి చెందిన కోళ్లను గుంత తవ్వి బూడ్చివేశారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి పీహెచ్ఓ రవీంద్రతో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.