అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా భారత న్యాయవాదుల సంఘం (ఐ.ఏ.ఎల్.) ఆధ్వర్యంలో రాయచోటిలో మహిళా న్యాయవాదులను ఘనంగా సన్మానించారు. కడప–అన్నమయ్య జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆనందకుమార్ ఆధ్వర్యంలో రాయచోటి బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు మహిళా న్యాయవాదులను సత్కరించారు.