సత్యసాయి: సీఎ చంద్రబాబు దూరదృష్టితో హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు ఎడారి ప్రాంతాలకు చేరడంతో రాయలసీమ పచ్చని పంటలతో కళకళలాడుతోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. బుక్కపట్నం మండలంలోని మారాల, సీకాయ కుంటపల్లి, కృష్ణాపురం గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించారు.