విశాఖలో పెళ్లి సంబంధం నిరాకరించి ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరింది. తెలంగాణ చిక్కడపల్లి అంబేద్కర్ కాలనీకి చెందిన అఖిల(21) ఈనెల 11న విశాఖకు వచ్చింది. శనివారం సాయంత్రం సెంట్రల్ పార్క్ వద్ద ఒంటరిగా ఉన్న ఆమెను టూటౌన్ కానిస్టేబుళ్లు శివకుమార్, దేవి గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ ఎర్రం నాయుడు ఆదివారం తల్లిదండ్రులకు అప్పగించారు.