కోనసీమ: ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే అని, ఆమె ఆశయాలకు పునారంకితం కావాలని దళిత చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజోలులో సావిత్రీబాయిఫూలే వర్థంతి కార్యక్రమాన్ని దళిత చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు లిఖితపూడి బుజ్జి అధ్యక్షతన నాయకులు నిర్వహించారు. తొలుత సావిత్రీబాయిఫూలే చిత్ర పటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.