NLR: బోగోలు మండలం అలిచర్ల బంగారుపాలెంలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారుల్లో ఇద్దరూ మృతి చెందగా, మరో ఇద్దరూ గల్లంతయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇవాళ కావలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున దాదాపుగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.