AKP: పాయకరావుపేట మండలం మంగవరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల బాలికలకు పోక్సో, గృహింస, డ్రగ్స్, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సీడీపీవో శ్రీవిద్య మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని వర్గాల వారు ముందుకు రావాలన్నారు. బాల బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.