KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు జిల్లా JAC ఆధ్వర్యంలో సాగుతున్న నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరాయి. ఈ కార్యక్రమానికి రోజురోజుకూ ప్రజాసంఘాల మద్దతు పెరుగుతోంది. APMRPS జిల్లా ప్రధాన కార్యదర్శి కృప ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు తరలివచ్చి దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఇవాళ ప్రధాన కూడలిలో టైర్లకు నిప్పు పెట్టి నిరసన చేశారు.