విజయనగరం: ఎస్.కోట నుండి విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళే బస్సు ఆపకుండా వెళ్ళిపోయిన ఘటన కొత్తవలస ప్రధాన బస్ స్టాప్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. బస్ స్టాప్ వద్ద మహిళ ప్రయాణికులు చెయ్యి ఎత్తిన అతి వేగంగా వెళ్లిపోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ ఘటన చోటుచేసుకోవడంపై మహిళలు మండిపడుతున్నారు. ఆర్టీసీ అధికారులు మహిళ దినోత్సవ వేడుకలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది.