కోనసీమ: యానాం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలు, ఆరోగ్య బీమా, ఓఎన్జీసీ పరిహారం, మత్స్యకారుల సమస్యలు, ఇళ్ల పట్టాల పంపిణీ, మినీ హార్బర్ పనులపై మంగళవారం సమీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరస్తామన్నారు.