NTR మైలవరం మండలం చంద్రగూడెం–పుల్లూరు సరిహద్దుల్లో జాతీయ రహదారిపై భారీ హోర్డింగ్ కూలిపోవడంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బలమైన గాలుల కారణంగా హోర్డింగ్ రోడ్డుపై పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హోర్డింగ్‌ను తొలగించే చర్యలు చేపట్టారు.