అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజల అర్జీలు స్వీకరించి సమస్యలను పరిష్కరించారు. కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించగా, మిగిలిన వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.