KDP: జిల్లాలో ఉన్న సోలార్, సిమెంట్ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అదానీ, NTPC, దాల్మియా, అల్ట్రాటెక్ వంటి పరిశ్రమలు స్థానిక వనరులు వినియోగించుకుంటూ యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.