VZM: నెల్లిమర్ల నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేర్కొన్నారు. శనివారం “కొండవెలగాడ – విజయనగరం కుమ్మరవీధి రోడ్ రిసర్ఫేసింగ్” పనులకు ఆమె శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. గత కొంతకాలంగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకంగా ఉన్న ఈ రహదారిని పునరుద్ధరించడం తన ప్రాధాన్యత అని తెలిపారు.