E.G: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయానికి అనేక వినతి పత్రాలతో ప్రజానీకం పోటెత్తారు. కడియం పేపర్ మిల్ కార్మికులు తమ సమస్యను పరిష్కరించాలని కోరగా, కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు.