KRNL: ఎస్టీలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రత్యేక పోటీలు నిర్వహించాలని డీవీఎంసీ సభ్యుడు సురేంద్ర కోరారు. శుక్రవారం కర్నూలులో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు వెంకటప్పను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్టీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రణాళికలు రూపొందించాలని, సంప్రదాయ క్రీడ అయిన విలువిద్యకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.