PPM: పార్వతీపురంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేశారు. ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్ఐ బి. నాగరాజుకు మెమోరాండం అందజేశారు. మున్సిపాలిటీ, మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు పెద్దఎత్తున ఆక్రమించబడ్డాయని ఆరోపించారు. సర్వే నెంబర్లను తారుమారు చేసి భూములను కబ్జా చేస్తున్నారన్నారు.