Mayilsamy: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..కమెడియన్ మయిల్స్వామి మృతి
సినీ ఇండస్ట్రీ(Movie Industry)లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్(Tollywood) హీరో తారకరత్న(Tarakaratna) మరణవార్త మరువకముందే సినీ ఇండస్ట్రీలో మరో నటుడు తుది శ్వాస విడిచారు. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మయిల్ స్వామి(Mayilsamy) మరణించారు.
సినీ ఇండస్ట్రీ(Movie Industry)లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్(Tollywood) హీరో తారకరత్న(Tarakaratna) మరణవార్త మరువకముందే సినీ ఇండస్ట్రీలో మరో నటుడు తుది శ్వాస విడిచారు. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మయిల్ స్వామి(Mayilsamy) మరణించారు. ఆదివారం ఉదయం మయిల్ స్వామి తన ఒంట్లో నలతగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో కుటుంబీకులు ఆయన్ని స్థానికంగా ఉన్న పోరూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే అప్పటికే మయిల్ స్వామి(Mayilsamy) మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మయిల్ స్వామి మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాద చాయలు అలముకున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కమెడియన్ మయిల్ స్వామి(Mayilsamy) 1984లో ‘ధవని కనవుగల్’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే తన స్టైల్ కామెడీతో అందర్నీ మయిల్ స్వామి ఆకట్టుకున్నాడు. ఇక అప్పటినుండి మయిల్స్వామి వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా సినిమాల్లో తనదైన కామెడీతో మయిల్ స్వామి(Mayilsamy) ప్రేక్షకులను నవ్వించారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో సుమారు 200 సినిమాలకు పైగా మయిస్ స్వామి నటించాడు. గతేడాది వచ్చిన ది లెజెండ్ సినిమాలోనూ మయిల్స్వామి కీలక పాత్రలో కనిపించారు. ఆయన మరణవార్తతో తమిళ సినీ పరిశ్రమ(Kollywood movie industry)లోని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.