»Taraka Ratna Health Condition Is Serious Bangalore To Moved To Hyderabad
Taraka Ratna: నందమూరి తారకరత్న కన్నుమూత
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హీరో నందమూరి తారకరత్న(Taraka Ratna) కన్నుముశారు. ఈ క్రమంలో బెంగళూరు(bangalore) నుంచి హైదరాబాద్(hyderabad)కు తీసుకొచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు(family members) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హీరో నందమూరి తారకరత్న(Taraka Ratna) కన్నుముశారు. ఈ క్రమంలో బెంగళూరు(bangalore) నుంచి హైదరాబాద్(hyderabad)కు తీసుకొచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు(family members) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆస్పత్రి(narayana hrudayalaya hospital)లో ఉన్న తారకరత్నను హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కుటుంబ సభ్యులు సహా పలువురు ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. అయితే గురువారం తారక్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు, శనివారం నాటికి హెల్త్ కండీషన్ విషమంగా మారి మృతి చెందినట్లు తెలిసింది.
పలువురు సందర్శన
ఇప్పటికే తారక్(Taraka Ratna) హెల్త్ కండీషన్ గురించి నందమూరి బాలకృష్ణ(balakrishna), కల్యాణ్ రామ్(kalyanram), ఎన్టీఆర్(ntr) సహా పలువురు బెంగళూరు వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మరోవైపు మంచు మనోజ్(manchu manoj) తోపాటు మరికొంత మంది తారకరత్నను ఆస్పత్రికి వెళ్లి చూశారు.
కుప్పంలో గుండెపోటు
టీడీపీ నేత నారా లోకేష్(nara lokesh) పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకత్నకు జనవరి 27న కుప్పంలో గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్(hyderabad) ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కూడా అతనికి పల్స్ సరిగా రాకపోవడంతోపాటు గుండెలో బ్లాక్స్ ఉన్నాయని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. దీంతో జనవరి 28న తెల్లవారుజామున ఒంటి గంటకు బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు తారక్ భార్య, కుమార్తెతోపాటు పురంధేశ్వరి సహా ఇతర కుటుంబ సభ్యులు వెంటనే బెంగళూరుకు చేరుకుని చికిత్స ప్రారంభించారు.
2003లో హీరోగా
హీరో నందమూరి తారక రత్న తెలుగు చిత్రసీమలోకి ఒకటో నంబర్ కుర్రాడు (2003)తో అరంగేట్రం చేశాడు. తన కెరీర్ ప్రారంభంలో “యువరత్న” (2003), “తారక్” (2003),, “భద్రాద్రి రాముడు” వంటి అనేక చిత్రాలకు ఒకేసారి సంతకం చేశాడు. చాలా సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత “అమరావతి” (2009)లో విలన్గా నటించి నంది అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు “రాజా చెయ్యి వేస్తే” (2016)లో కూడా ప్రధాన పాత్రను పోషించాడు. హాట్స్టార్ ఆన్లైన్ సిరీస్ “9 గంటలు”(2020) ఇటీవలి ఎపిసోడ్లో, అతను ప్రధాన పాత్రను పోషించాడు. తర్వాత మరికొన్ని సినిమా ప్రాజెక్టులు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు సందర్భాలలో రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.
నిమ్మకూరులో
నందమూరి తారక రత్న(Taraka Ratna) ఫిబ్రవరి 22న, 1983న ఏపీలోని నిమ్మకూరు(nimmakuru)లో జన్మించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ- శాంతిల కుమారుడు. తారక్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు మనవడు, బాలకృష్ణకి మేనల్లుడు.