AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 5న క్యాంపస్ రిక్రూమెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తాతాజీ తెలిపారు. వందే భారత్ రైళ్లకు స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ ప్రతినిధులు ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 197 మంది నిరుద్యోగులకు ఉపాధి కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.