శ్రీలంక హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని జయసూర్య నిర్ణయించుకున్నాడు. T20 WC సెమీస్‌కు లంక చేరకపోవడంతో.. తన బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డాడు. టైటిల్‌తో తన పదవి నుంచి వైదొలగాలనుకున్నా కానీ అలా సాధ్యపడకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. కాగా జయసూర్య కాంట్రాక్ట్ జూన్ వరకు ఉండగా.. తన నిర్ణయాన్ని త్వరలోనే లంక బోర్డుకు తెలియజేస్తానన్నాడు.