TG: రాష్ట్ర ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకాన్ని విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళలతో పాటు దివ్యాంగ పురుషులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మహిళలకే పరిమితమైన ఈ పథకం ఇకపై దివ్యాంగులందరికీ వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రవాణా భారం తగ్గి, వేలాది మంది లబ్ధి పొందనున్నారు.