ప్రకాశం: కంభం మండలం కందులాపురంలోని ఎల్బీఎస్ నగర్లో సోమవారం ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో వీరభద్రాచారి స్వయంగా హాజరై పన్ను వసూళ్లను పర్యవేక్షించారు. పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పన్నులు చెల్లించాలని గ్రామస్తులను కోరారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు పన్నుల వసూళ్లు కీలకమని ఎంపీడీవో అన్నారు.