NGKL: చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు కార్యనిర్వహణాధికారి రంగా చారి తెలిపారు. మార్చి 3 ఉదయం 8 గంటలకే ఆలయ ద్వారాలు మూసివేస్తారు. తిరిగి మార్చి 4 ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.