WNP: చంద్రగ్రహణం సందర్భంగా కానాయపల్లి కోటిలింగేశ్వర దేవస్థానాన్ని రేపు మూసివేస్తున్నట్లు నిర్వాహకులు శేఖరయ్య తెలిపారు. ఉదయం 9 గంటలకు మహా రుద్రాభిషేకం ముగిసిన వెంటనే ఆలయ ద్వారాలు మూసివేస్తారు. గ్రహణం కారణంగా పౌర్ణమి నాటి శివపార్వతుల కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలను రద్దు చేశారు. తిరిగి బుధవారం ఉదయం శుద్ధి, సంప్రోక్షణ అనంతరం ఆలయం తెరువబడుతుంది.