రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇండియాలో 3 కోట్ల ఫుట్‌ఫాల్స్ (ప్రేక్షకుల సంఖ్య) మార్కును దాటి బాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. కరోనా తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో హిందీ చిత్రంగా నిలిచింది. గతంలో గదర్ 2, జవాన్, స్త్రీ 2, ఛావా, ధురంధర్ 1 మాత్రమే ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం.