NLG: పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో చికెన్ షాపులను మూసి వేసి వ్యాపారులు నిరసన తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షులు అన్వేష్ చౌదరి మాట్లాడుతూ.. మార్జిన్ తగ్గడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. షాపుల నిర్వహణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బంద్ కొనసాగిస్తామని పేర్కొన్నారు.