KRNL: చిన్నతుంబలంలో “వీబీ జీ రామ్ జీ” పనులను మండల అధ్యక్షుడు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప ఇవాళ ప్రారంభించారు. గ్రామస్తులు ఉపాధి హామీ పనులను నిర్దేశించిన కొలతలను బట్టి చేయాలన్నారు. ప్రతిరోజు విధిగా కూలీ పనులకు వచ్చి హాజరు శాతాన్ని నమోదు చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి ఆస్కారం లేకుండా పథకాన్ని పటిష్టం చేసిందన్నారు.