TG: ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు మంత్రి వాకిటి శ్రీహరి చెక్కులను పంపిణీ చేశారు. మక్తల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏడు మంది రైతులకు మొత్తం రూ.2 కోట్ల 88 లక్షల 43 వేల విలువైన నష్టపరిహారం చెక్కులను అందజేశారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎకరాకు రూ.14 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నట్లు వివరించారు.