NLR: CM చంద్రబాబు నేడు వింజమూరు మండలం ‘జాగీరు వనం’ సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా వింజమూరులో బందోబస్తు సిబ్బందికి ఎస్పీ డా. అజిత వేజెండ్ల కీలక ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అనంతరం అధికారులతో కలిసి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.