KDP: ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 27 నుంచి ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మంగళవారం రాత్రి గరుడసేవ ఘనంగా జరిగింది. పురవీధుల్లో స్వామి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, కేరళం కళాకారుల వాయిద్యాలు, మహిళల కోలాటాల నడుమ స్వామివారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.