MULG: ములుగు పట్టణంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో డీఎస్పీ కిషోర్ కుమార్ డ్రైవర్లు కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ములుగు, వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ శిబిరంలో 300 మందికి పైగా డ్రైవర్లు, యువకులకు డా. వేణుమాధవ్ బృందం పరీక్షలు నిర్వహించింది. అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. సీఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.