AP: మెరుగైన ప్రజారోగ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఒక ఉద్యమంలా కృషి చేయాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘సంజీవని ప్రాజెక్టు’ను జూలై నాటికి రాష్ట్రమంతటా విస్తరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదిలోగా సుమారు 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు భాగస్వామ్యం కావాలని సూచించారు.