TG: HYD మధురనగర్లోని ఓ బ్యాంక్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో భవనం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.