AP: రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల కోసమే అమరావతి నిర్మాణం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ఎన్డీఏ ప్రభుత్వ ఘనతేనని గుర్తు చేస్తూ, ఆ కళాశాలకు NTR పేరు పెట్టాలని ప్రతిపాదించారు.