KRNL: రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో మరల ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే పనులలో పురోగతిని తీసుకొని రావడంతో పాటు, గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు.