W.G: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం ఎల్ఎన్ పురం, మాలవానితిప్ప, కోమటిగుంట గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ఇవాళ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలను సైతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.