NGKL: నాగర్ కర్నూల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్ రావు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు తీసుకురావడంపై రవికాంత్ రావు హర్షం వ్యక్తం చేసి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.