SRD: మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరులో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని విమర్శించారు. బిఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు.