BDK: రాష్ట్రవ్యాప్తంగా సిమెంట్ ధరలు రేపటి నుంచి భారీగా పెరగనున్నాయి. సిమెంట్ కంపెనీలు బస్తా పై గణనీయమైన ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే డీలర్లకు సమాచారం అందించాయి. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం, ముడి సరుకుల ధరల పెంపు వంటి కారణాల వల్ల కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.