W.G: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పెనుమంట్ర సీడీపీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలుతో పాటు వేతనంతో కూడిన వైద్య సెలవులు కల్పించాలని నేతలు ఉషారాణి, గోపాలన్ డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల్లో వివక్ష చూపకూడదని పేర్కొన్నారు.