BHNG: రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం 8వ వార్డులో నెలకొన్న లో-వోల్టేజీ సమస్య పరిష్కారమైంది. మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి చొరవతో, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు అధికారులు యుద్ధప్రాతిపదికన నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. మాజీ సర్పంచ్ సత్తిరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.