హీరోయిన్ సంయుక్త మీనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో ధనుష్‌తో తనకున్న వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంది. ‘సార్’ సినిమా సమయంలో ధనుష్‌తో పనిచేయడం అద్భుతమని, ఆయన గొప్ప నటుడని కొనియాడింది. కెమెరా ముందు ఆయన చూపించే అంకితభావం, ఎనర్జీ చూసి ఫిదా అయ్యానని అందుకే తాను మళ్లీ కలిసి పనిచేయాలనుకునే నటుల్లో ఆయన ఎప్పుడూ ముందుంటారని సంయుక్త తన మనసులోని మాటను బయటపెట్టింది.