MDCL: ఉప్పల్ నుంచి చిల్కానగర్ వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు పనుల కారణంగా తాత్కాలికంగా మూసివేయబడింది. కావేరి నగర్ కాలువ వద్ద పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇప్పటికే కొన్ని వాహనాలు మధ్యలో ఇరుక్కుపోయాయి. అటువైపు వెళ్లొద్దని సూచించారు.