PPM: ఈ నెల 6 నుంచి జిల్లాలో పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుందని DEO పి. బ్రహ్మజీ రావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ స్దానిక DVMM హై స్కూల్, గవర్నమెంట్ గర్ల్ హై స్కూల్ రెండు కేంద్రాల్లో ఈ నెల 15 వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.