అన్నమయ్య: మదనపల్లె మండలంలో గురువారం ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించి పసి పిల్లలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. కోళ్ల బైలు గ్రామం బాబుకాలనీలో కాపురం ఉంటున్న కుందన్(5), దుర్వింత్ రామ్ (2), తదితరులు ఇంటి ముందు వీధిలో ఆడుకుంటుండగా పిచ్చికుక్క దాడిచేసి తీవ్రంగా గాయ పరిచిందని బాధిత కుటుంబీకులు అన్నారు. పిల్లలను వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.