JGL: రైతులు తమ పొలాల్లో తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించుకుని, ఫలితాలకు అనుగుణంగానే ఎరువులు వాడాలని ఏఈవో సరోజిని సూచించారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం వెంగళాయిపేటలో రైతులు మట్టి నమూనాలను సేకరించి అధికారులకు అందజేశారు. అనవసర ఎరువుల వాడకం తగ్గించి సాగు ఖర్చు నియంత్రించుకోవాలని ఆమె కోరారు. ఆయనతో పాటు సర్పంచ్ గోపాల్, కార్యదర్శి ఉన్నారు.