GDWL: వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంగళవారం Hit TV ద్వారా స్థానిక రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారని, ప్రభుత్వ మద్దతు ధర దక్కాలంటే వెంటనే కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఋతుపవనాల వల్ల వర్షాలు రాకముందే పంట కొనుగోలు చేయాలన్నారు.